VIDEO: చందుర్తిలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ
SRCL: చందుర్తి మండల కేంద్రంలో శుక్రవారం అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం చందుర్తి మండల కేంద్రంలో అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో పడిపూజను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గూడెం గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పదునెట్టం బడి నిర్వహించారు. అయ్యప్ప స్వామి శరణు ఘోషతో చందుర్తి మారు మోగింది.