అదనపు కలెక్టర్ ఇంట్లో పేలిన ఏసీ

ASF: ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ డేవిడ్ నివాసంలో ఉన్న ఏసీ కంప్రెసర్ ఒక్కసారిగా పేలింది. జిల్లా కేంద్రంలోని అదనపు కలెక్టర్ బంగ్లాలో ప్రమాదవశాత్తు ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఇంట్లో ఉన్న అదనపు కలెక్టర్ కుటుంబ సభ్యులు అప్రమత్తతతో వెంటనే బయటికి పరుగులు తీసి ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.