సబ్ స్టేషన్‌ను ముట్టరించిన రైతులు

MDK: విద్యుత్ కోతలకు నిరసనగా రేగోడ్ మండలంలోని చౌదర్‌పల్లి రైతులు సోమవారం సబ్ స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించేంత వరకు కదలబోమని రైతులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్సై పోచయ్య జోక్యం చేసుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.