పంట కాలువలోకి దూసుకెళ్లిన లారీ

పంట కాలువలోకి దూసుకెళ్లిన లారీ

W.G: పెంకిలపాడు సమీపంలో మంగళవారం నరసాపురం నుంచి పాలకొల్లు వస్తున్న రొయ్యల కంటైనర్ అదుపుతప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అవ్వగా అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటు వైపు ఎవ్వరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.