VIDEO: 'ఆవిర్భావ దినోత్సవాన్ని పండగలా నిర్వహిద్దాం'
VSP: జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సేవా కార్యక్రమాలతో పండగలా నిర్వహిస్తామని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. మార్చి 14న రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, రోగులకు పండ్ల పంపిణీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. అధినేత పవన్ కళ్యాణ్ పాడేరు గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదులో పెందుర్తి రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉందన్నారు.