ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు.. వ్యక్తికి స్వల్ప గాయాలు

ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు.. వ్యక్తికి స్వల్ప గాయాలు

BHPL: గణపురం(M) బుర్రకాయల గూడెం సమీపంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గణపురం మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉమ్మల్ల విజేందర్ విధులు ముగించుకుని కారులో ఇంటికి బయలుదేరగా, అడ్డుగా వచ్చిన బైక్‌ను తప్పించబోయి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ డోజర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో విజేందర్ క్షేమంగా బయటపడ్డారు.