నర్సింగాపూర్‌లో 'అరైవ్ అలైవ్' కార్యక్రమం
SRCL: రోడ్లపై వెళ్లే ప్రతి వాహనదారుడు అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం నర్సింగాపూర్ గ్రామంలో 'అరైవ్ అలైవ్' కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువ సంభవిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.