విద్యార్థులకు 108 సేవలపై అవగాహన

విద్యార్థులకు 108 సేవలపై అవగాహన

NZB: జక్రాన్‌పల్లి కస్తూర్భా కళాశాలలో 108 సిబ్బంది విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సీపీఆర్ (CPR) ఎలా చేయాలి, ఆపద సమయాలలో ప్రథమ చికిత్స అందించే విధానాన్ని ఈఎంటీ అకేష్, పైలట్ నవీన్ వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.