CBSE 10, 12 ఫలితాలపై లేఖ.. క్లారిటీ

CBSE 10, 12 ఫలితాలు మే 6న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నట్లు ఓ లేఖ విడుదలైన విషయం తెలిసిందే. ఈ లేఖను CBSE బోర్డు ఖండించింది. అది ఫేక్ అని, తాము ఆ లెటర్‌ను రిలీజ్ చేయలేదని తేల్చి చెప్పింది. సర్టిఫై కాని వార్తలను షేర్ చేయొద్దని సూచించింది. సరైన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని కోరింది.