వర్ధన్నపేట మండల పంచాయతీ అధికారికి పదోన్నతి

WGL: వర్ధన్నపేట మండల పంచాయతీ అధికారి అంకం ధనలక్ష్మికి డివిజనల్ పంచాయతీ అధికారిగా పదోన్నతి కల్పిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగిత్యాల జిల్లా కోరుట్ల డివిజన్‌లో బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న మరో ఆరుగురు ఎంపీవోలకు సైతం డీఎల్‌పీవోగా పదోన్నతి కల్పిస్తూ వారిని ప్రభుత్వం బదిలీ చేసింది.