బనగానపల్లెలో ఘనంగా భగీరథ మహర్షి జయంతి

నంద్యాల: బనగానపల్లె కఠోర తపస్సుతో గంగను భూవికి తీసుకువచ్చిన మహా ఋషి భగీరథ మహర్షి అని బనగానపల్లె నియోజకవర్గ సగర సేవా సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం బనగానపల్లెలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. భగీరథుడు మహా జ్ఞాని అని కొనియాడారు.