బలపాల గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం
MHBD: కురవి మండలం బలపాల గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ అభివృద్ధికి రహదారులు కీలకమని పేర్కొంటూ, నాణ్యమైన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.