దివ్యాంగులకు ఫిజియోథెరపీ పరికరాలు అందించిన ఎంపీపీ

దివ్యాంగులకు ఫిజియోథెరపీ పరికరాలు అందించిన ఎంపీపీ

NTR: జి.కొండూరులోని భవిత సెంటర్‌లో దివ్యాంగ చిన్నారుల ఫిజియోథెరపీ కోసం ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ తమ సొంత నిధులతో స్టిమ్యులేటర్ పరికరాన్ని మంగళవారం అందజేశారు. ఈ పరికరం దివ్యాంగ చిన్నారుల శారీరకాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పరికరాన్ని అందజేసినందుకు తల్లిదండ్రులు, విద్యార్థులు ఎంపీపీకి కృతజ్ఞతలు తెలిపారు.