VIDEO: ఘనంగా సామూహిక రుద్రాభిషేకాలు
ASR: అరకులోయలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. మాస శివరాత్రి పురస్కరించుకుని మంగళవారం రాత్రి రుద్రాభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ పూజారి వెంకన్నబాబు తెలిపారు. కార్తీక మాసం కావడంతో అరకులోయ, చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు భక్తిశ్రద్దలతో ఈ కార్యక్రమంలో పాల్గొని శివునికి రుద్రాభిషేకం చేశారు.