ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

WNP: వనపర్తిలోని ప్రభుత్వ ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆగస్టు 28 వరకు ఆన్లైలైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఆసక్తిగల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.