హుజూర్‌నగర్ పట్టణానికి మరో రింగ్ రోడ్డు
SRPT: హుజూర్‌నగర్ పట్టణానికి మరో రింగ్ రోడ్డు రాబోతోంది. పట్టణంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుండడంతో రెండో రింగ్ రోడ్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హుజూర్‌నగర్‌లోని 167వ జాతీయ రహదారికి అనుసంధానంగానే రెండో రింగ్ రోడ్డు ఏర్పాటు చేయనున్నారు. కాగా నూతనంగా నిర్మించనున్న రింగ్ రోడ్డు గడ్డిరెడ్డి ఫంక్షన్ హాల్ - శ్రీనగర్ కాలని వరకు నిర్మించనున్నారు.