ఎలుకల మందు తాగి యువకుడు మృతి

ఖమ్మం రూరల్ మండలం, పల్లెగూడెంలో విషాదం చోటు చేసుకుంది. బత్తిని నిఖిల్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లికి ఆ యువతి ఒప్పుకోకపోవడంతో మనస్థాపం చెంది వారం రోజుల క్రితం ఎలుకల మందు తాగాడు. దీంతో తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడు.