తుఫాన్ బాధితులకు సహాయం అందించిన జేసీ
కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం మొంథా తుఫాన్ బాధితులకు సహాయం అందిస్తోందని జేసీ ఎం.నవీన్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డ మండలం పులిగడ్డ పల్లెపాలెంలో తుఫాన్ బాధితులకు బియ్యం, నూనె, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పంచదార పంపిణీనీ జేసీ ప్రారంభించారు. ఆర్డీవో స్వాతి, ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.