విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

ప్రకాశం: అద్దంకి మండలంలోని మణికేశ్వరం గ్రామంలో విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకొంది. స్థానికుల వివరాల మేరకు.. బీహార్ రాష్ట్రానికి చెందిన వికాస్ జాదవ్ (22) మణికేశ్వరంలో ఓ రైతు వద్ద కూలీగా పనిచేస్తున్నాడు. బుధవారం పశువుల చావిడిలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని సీఐ సుబ్బరాజు, ఎస్సై ఖాదర్ బాషా పరిశీలించారు.