పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం: డీఈఓ
W.G.ఈనెల 16 నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ నారాయణ శనివారం ఆయన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. జిల్లాలో మొత్తం 132 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 24,166 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరవుతారనిచెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు.