రెచ్చగొట్టే పోస్టులు వద్దు: ఎస్సై

రెచ్చగొట్టే పోస్టులు వద్దు: ఎస్సై

VKB: ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని దోమ ఎస్సై వసంత్ జాదవ్ కోరారు. సోషల్ మీడియా వేదికల్లో రెచ్చగొట్టే, ద్వేషపూరిత, వర్గ వైషమ్యాలు రేకెత్తించే వ్యాఖ్యలు, పోస్టులు, వీడియోలు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వాట్సాప్ గ్రూపుల్లో అలాంటి పోస్టులు పెడితే గ్రూప్ అడ్మిన్‌లపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.