కొండపర్వ గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం
NTR: విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి షేక్ టిప్పు సుల్తాన్ తెలియజేశారు. రబీ సీజన్లో తాము సాగు చేసిన పంటలను ఆ గ్రామ రైతు సేవా కేంద్రంలో ఈ-పంట నమోదు చేయించుకోవాలని కోరారు. అంతేకాక మొక్కజొన్నలో సస్యరక్షణ గురించి పలు సూచనలు చేశారు.