రికార్డు స్థాయిలో కోడిగుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.7 దాటిపోగా, హోల్‌సేల్ మార్కెట్‌లోనూ ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి. చిత్తూరు జిల్లాలో 100 గుడ్ల ధర రూ.673కు చేరింది. విశాఖ, హైదరాబాద్ మార్కెట్లలో రూ.635గా నమోదైంది. విజయవాడలో రూ.660, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ.639గా పలుకుతోంది.