విద్యార్థులపై తల్లితండ్రులు దృష్టి సారించాలి: డీఎస్పీ
BDK: ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలోని చెరువులు, వాగుల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సర్పంచులు, కార్పొరేటర్లు, నాయకులను సోమవారం ఇల్లందు డీఎస్పీ యు.వెంకన్న బాబు కోరారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు వాగులు, చెరువులు, ప్రాజెక్టుల్లో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై తల్లితండ్రులు దృష్టి సారించాలని అన్నారు.