గాలివీడులో మద్యం బాటిళ్లు స్వాధీనం

కడప: గాలివీడు పట్టణ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో శనివారం సింపిరి శివ అనే వ్యక్తి నుంచి పది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వెంకటప్రసాద్ పేర్కొన్నారు. పందిళ్లపల్లికి చెందిన శివ అనే వ్యక్తి అక్రమంగా మద్యం బాటిళ్లు కలిగి ఉన్నాడనే సమాచారం రావడంతో తన సిబ్బందితో దాడులు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు.