VIDEO: ఎమ్మెల్యే కాన్వాయ్‌కి ప్రమాదం
JGL: కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజల కోసం వెళ్తున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఓ కారు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టడంతో, వెనుక వస్తున్న కార్లు కూడా ఒకదానికొకటి ఢీకొని, ఎయిర్ బ్యాగ్లు తెరుచుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.