PNG కనెక్షన్ల విస్తరణ వేగవంతం చేయాలి: జేసీ
W.G: జిల్లాలో పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ల విస్తరణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో గోదావరి గ్యాస్, మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. LPG సిలిండర్ల కంటే PNG ద్వారా నెలకు రూ.100 నుంచి రూ.150 వరకు ఆదా అవుతుందని తెలిపారు.