ఇది కాంగ్రెస్ పిరికి చర్యకు నిదర్శనం: ఎంపీ

ఇది కాంగ్రెస్ పిరికి చర్యకు నిదర్శనం: ఎంపీ

TG: మణుగూరు ఘటనతో కాంగ్రెస్ నీచ సంస్కృతి బయటపడిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. బీఆర్ఎస్ ఆఫీసు‌పై కాంగ్రెస్ నేతల దాడి పిరికి చర్య అని మండిపడ్డారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి కార్యాలయాన్ని తగలబెట్టారని ధ్వజమెత్తారు. సర్వే రిపోర్టులు చూసి కాంగ్రెస్‌లో అసహనం పెరిగిందని దుయ్యబట్టారు. డీజీపీ వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.