గుంటూరు కొత్తపేటలో వాహనాల తనిఖీలు

గుంటూరు కొత్తపేటలో వాహనాల తనిఖీలు

GNTR: గుంటూరు కొత్తపేట నాజ్ సెంటర్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు బుధవారం వాహనాల తనిఖీలు చేశారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరు వాహన డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తూర్పు ట్రాఫిక్ ఎస్ఐ పెద్దిరాజు అన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు బైకులు ఇవ్వరాదన్నారు. మద్యం తాగిన డ్రైవ్ చేసే వారి వాహనాలను సీజ్ చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.