నాగలదిన్నె దేవరలో పాల్గొన్న ఎమ్మెల్యే

నాగలదిన్నె దేవరలో పాల్గొన్న ఎమ్మెల్యే

KRNL: నందవరం మండలం నాగలదిన్నె గ్రామంలో జరిగిన గ్రామదేవతల దేవర కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. మారెమ్మ,పెద్దమ్మ, చిన్నమ్మ అవ్వ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు బుధవారం నిర్వహించారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లి దేవర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.