ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
VZM: భోగాపురం ఎంపీడీవో కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ జన శిక్షణ సంస్థాన్ సహకారంతో ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పాల్గొని శిక్షణ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలను కేవలం ఉద్యోగులుగా కాక, ఉద్యోగ కల్పనదారులుగా మార్చడం కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.