శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో శ్రీకృష్ణ అష్టమి వేడుకలు

TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలోని సప్త గోకులం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సప్త గోకులంలో వెలసియున్న శ్రీకృష్ణుని విగ్రహానికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి, విశేష అలంకరణ చేశారు. అనంతరం ముందుగా గోకులంలోని గోవులకు పసుపు, కుంకుమలతో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ గోపూజ చేశారు.