రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

JN: జనగామ రైల్వే స్టేషన్‌లో ప్రమాదవశాత్తు శుక్రవారం రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన గోవిందా మహాదేవ్ అనే వ్యక్తికాజీపేట వైపు వెళ్లే రైలు నుండి జారి కిందపడి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు హైదరాబాదులో కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు.