VIDEO: అమ్మకు అక్షరమాల పరీక్షలు నిర్వహణ
KNR: జమ్మికుంట మండలంలో ఉల్లాస్ అభ్యాసకులకు ఆదివారం ఎన్ఐవోఎస్ పరీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో చదువుకోని మహిళల కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా విద్యాశాఖ, జిల్లా వయోజన విద్యాశాఖ సమన్వయంతో అక్టోబర్ నుంచి 100 రోజుల పాటు అమ్మకు అక్షరమాల అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్షర కేంద్రాల్లో చదవు నేర్చుకున్న అభ్యాసకులకు పరీక్ష నిర్వహించారు.