VIDEO: పారిశుద్య పనులను పరిశీలించిన కమిషనర్

CTR: పుంగనూరు పట్టణంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్య కార్యక్రమాలను మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. శనివారం పట్టణ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కార్మికులు పారిశుద్య పనులు చేపట్టారు. రోడ్లకు ఇరువైపులా పేరుకుపోయిన మట్టిని తొలగించి శుభ్రం చేశారు. వర్షపు నీరు రోడ్లపై నిలువ లేకుండా తగు చర్యలు చేపట్టారు.