కాప్రాలో అక్రమ నిర్మాణాలపై చర్యలేవి..?
MDCL: కాప్రా పరిధి కమలానగర్ ప్రాంతంలో అక్రమంగా మెట్ల నిర్మాణం జరుగుతోందని, దీనికి సంబంధించి డిప్యూటీ కమిషనర్ అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. ఫిర్యాదు చేసే దాదాపుగా 14 రోజులు గడుస్తున్నప్పటికీ, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లుగా తెలిపారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.