కేరళ ఆలయాల అభివృద్ధికి అనంత్ అంబానీ భారీ విరాళం
కేరళ పర్యటనలో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తన ఉదారతను చాటుకున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి, ఏనుగుల సంరక్షణ కోసం రూ.18 కోట్లను విరాళంగా ప్రకటించారు. వీటిలో గురువాయూర్, రాజరాజేశ్వరం ఆలయాలకు చెరో రూ.3 కోట్లు, అలాగే రాజరాజేశ్వరం ఆలయంలో శిథిలావస్థలో ఉన్న తూర్పు గోపురం పునర్నిర్మాణానికి రూ.12 కోట్ల కేటాయించారు.