ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి

SDPT: కొండపాక మండలం కొమురవెళ్లి కమాన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి సిద్దిపేట వెళ్తున్న లారీ బైక్‌ను ఢీకొనడంతో బొర్ర సాన్విక (10) అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి రాజు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.