చేనేత సమస్యలపై 25న 'మహా ధర్నా'

చేనేత సమస్యలపై 25న 'మహా ధర్నా'

NLG: చేనేత సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 25న HYD ఇందిరా పార్కు వద్ద 'మహా ధర్నా' నిర్వహించనున్నట్లు తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గంజి మురళీధర్ తెలిపారు. చేనేత భరోసా, త్రిఫ్ట్ పథకం, నేతన్న భీమా, రుణమాఫీ, సహకార ఎన్నికల నిర్వహణే ప్రధాన డిమాండ్లతో మహా ధర్నా జరుగుతుందని పేర్కొన్నారు. గత పోరాటాల వల్లే రుణమాఫీ సాధ్యమైందని గుర్తు చేశారు.