దుబ్బాక పెద్ద చెరువుకు కాళేశ్వరం జలాలు

దుబ్బాక పెద్ద చెరువుకు కాళేశ్వరం జలాలు

SDPT: నాలుగేళ్లుగా నిలిచిపోయిన కాళేశ్వరం జలాల ప్రవాహం మళ్లీ దుబ్బాక పెద్ద చెరువుకు చేరనుంది. కొందరి స్వార్థం వల్ల నీటి రాకకు అడ్డంకులు ఎదురయ్యాయని స్థానికులు ఆరోపించిన నేపథ్యంలో, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ల కృషితో కాలువ మార్గంలోని అడ్డంకులను తొలగించి, చెరువు నింపేందుకు చర్యలు చేపట్టారు.