VIDEO: నాగార్జున సాగర్‌కు భారీ వరదనీరు

NLG: భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. 20 గేట్లు 13 అడుగులు, 6 గేట్లు 10 అడుగుల పైకెత్తారు. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణా నది దిగువ పరివాహక ప్రాంతంలోని మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.