'రక్షణ కంచెను ఏర్పాటు చేయండి'
శ్రీకాకుళం పట్టణంలో ఉన్న శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎటువంటి రక్షణ కంచే లేకపోవడంతో ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఉందని స్థానికులు అంటున్నారు. ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని అటువంటి సమయంలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. అధికారులు స్పందించి రక్షణ కంచెన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.