నందిగామలో 'అన్నదాత సుఖీభవ' కార్యక్రమం
నందిగామ పట్టణం బాబు జగజీవన్ రామ్ భవనంలో బుధవారం 'అన్నదాత సుఖీభవ' రెండో విడత నిధుల విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 'రైతు లేనిదే రాష్ట్రం లేదు' అనే నినాదంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.