VIDEO: వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో సహస్రనామార్చన
VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో గురువారం సహస్రనామార్చన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో వేదపండితులు సంకల్పం పఠించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య సేవ పూర్తిచేసి భక్తులకు ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, ప్రసాదం పంపిణీ చేశారు.