రేపు ఘనంగా గణపతి హోమం నిర్వహణ
SRD: పటాన్ చెరువు శాంతినగర్, శ్రీనగర్ (ఎలైట్ అండ్ రిచ్) జంట కాలనీలలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో రేపు గణపతి హోమం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధ్యక్షులు నర్రా బిక్షపతి, గౌరవ అధ్యక్షులు కొత్త కాపు రమా సంజీవరెడ్డి తెలిపారు. దేవాలయ వార్షికోత్సవ సందర్భంగా గణపతి హోమం, అర్చన, అభిషేకం, కలశాల పూజలు ఘనంగా జరపనున్నట్లు గురుస్వాములు తెలిపారు.