విద్యుత్ షాక్ తో రైతు మృతి

విద్యుత్ షాక్ తో రైతు మృతి

ప్రకాశం: పొదిలి మండలం అన్నవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం పొలంలో నీటి మోటర్ ఆన్ చేసేందుకు వెళ్లి రైతు చెన్నయ్య(55) విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానిక రైతులు విషయాన్ని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. రైతు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.