అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ మృతి

అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ మృతి

అన్నమయ్య: పీలేరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బి. వెంకటరమణ (55) అనారోగ్యంతో మరణించారు. ములకలచెరువు మండలం చౌడ సముద్రం గ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించగా, పోలీసులు గౌరవ వందనం తెలిపారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సంతాపం వ్యక్తం చేసి కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన 33 ఏళ్ల పాటు పోలీసు శాఖలో సేవలందించారు.