తప్పిపోయిన బాలిక తల్లిదండ్రులకు అప్పగింత

తప్పిపోయిన బాలిక తల్లిదండ్రులకు అప్పగింత

సత్యసాయి: గాండ్లపెంట మండలానికి చెందిన 16 ఏళ్ల మైనర్‌ బాలిక కనిపించకుండా పోయిన కేసును అనంతపురం త్రీటౌన్‌ పోలీసులు గురువారం పరిష్కరించారు. ​బాలిక అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌లో ఒంటరిగా తిరుగుతుండగా పోలీసులు గుర్తించారు. ఆరా తీయగా, మిస్సింగ్‌ బాలిక అని తెలిసింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, బాలికను సురక్షితంగా వారికి అప్పగించారు.