తుళ్లూరులో దిష్టిబొమ్మ దగ్ధం

తుళ్లూరులో దిష్టిబొమ్మ దగ్ధం

GNTR: తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్‌పై వచ్చిన కథనంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గ్రామంలోని నాయకులు, కార్యకర్తలు సదరు పత్రిక ప్రతులను దిష్టిబొమ్మకు తగిలించి దగ్ధం చేశారు. కావాలని ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంపై పోలీసులు తక్షణమే స్పందించాలని కోరారు.