వారం సంతను ప్రారంభించిన ఎమ్మెల్యే
BDK: దుమ్మగూడెం మండలంలో గౌరారం గ్రామపంచాయతీలో వారం సంతను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గురువారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు సంత కొనసాగుతుందని తెలిపారు. అన్ని రకాల నిత్యవసరాలు కూరగాయలు అందుబాటులో ఉంటాయని చుట్టుపక్కల గ్రామస్తులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.